Sunday, January 17, 2010

శ్రీసిధ్ధమంగళ స్తోత్రము

శ్రీపాద వల్లభ స్వామివారి దివ్య సిధ్ధమంగళ స్తోత్రము
-------------------------------------------------------


1. శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసిమ్హరాజా !
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||
2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా! | జయవిజయీభవ ||
3. మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీపాదా! |జయవిజయీభవ ||
4. సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా! |జయవిజయీభవ ||
5. సవితృకాఠకచయనపుణ్యఫల భరద్వాజఋషిగోత్ర సంభవా! |జయవిజయీభవ ||
6. దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా! |జయవిజయీభవ ||
7. పుణ్యరూపిణీ రాజమాబ సుత గర్భపుణ్యఫల సంజాతా! |జయవిజయీభవ ||
8. సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా! |జయవిజయీభవ ||
9. పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా! |జయవిజయీభవ ||
-------*---------------*--------------- -------*---------------*---------------

No comments:

Post a Comment