రచన: జగద్గురు శ్రీ సచ్చిదానందశివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారు
సుత్రామపూజిత పవిత్రాఞ్ఘ్రిపద్మయుగ పత్రార్చితే2భవదన |
మిత్రాభ సాంబశివపుత్ర అరివర్గ-కృత-విత్రాస విఘ్నహరణ |
ఛత్రాభిశోభిత తనుత్రాభిభూషిత పరిత్రాణదీక్షిత విభో |
శ్రోత్రాభిరామగుణ పిత్రాసమోసి భవ మత్త్రాణకర్మనిరతః || 1 ||
వన్దారుభక్తజనమన్దార పాదనత బృన్దారకార్చిత మహా-
నన్దానుషఞ్గకర నిన్దాకరారిగణ సన్దాహకాబ్జచరణ(హృదయ) |
మన్దాకినీధర ముకున్దాభినన్దిత సుకన్దాదిభక్ష్యరసిక
వన్దామహే సులభ శం దాతుమర్హసి మరన్దానురఙ్చిత విభో || 2 ||
పాపాపనోదకర శాపాయుధేడ్యభవ తాపార్తశోకహరణ |
శ్రీపార్వతీతనయ కోపార్దితారిగణ ధూపాదితోష్యహృదయ |
భూపాలమౌలినత గోపాలపూజ్య సుమచాపారి-పూర్వతనయ |
రూపాదిమోహకర దీపార్చిషశ్శలభం ఆపాలయైనం అధునా || 3 ||
హాలాహలాశిసుత మాలావిభూషిత సుశీలావనైక నిరత |
శ్రీలాభకారక వినీలాలివృన్దకృత కోలాహలారవ విభో |
లీలాతితుష్ట వరశైలాత్మజాఞ్కధృత బాలాఖువాహ విలసత్-
ఫాలాధునా దలయ కాలద్భయం మహిత-వేలావిహీన-కరుణ || 4 ||
ఏకాచ్ఛదన్తమతిశోకాతురాఞ్ఘ్రినత లోకావనైక నిరతం |
నాకాలయస్తుతమనేకాయుధం వివిధశాకాదనం సుఖకరం |
శ్రీకాన్తపూజ్యం అరిహాకారకారం(రిం) అతిభాకారిణం కరిముఖం |
రాకాసుధాంశులసదాకారమాశు నమమాకామనాస్తు చ పరా || 5 ||
అంభోజనాభనుతం అంభోజతుల్యపదం అంభోజజాతవినుతం |
దంభోలిధారినుత కుంభోద్భవార్చ్య(ది) చరణాంభోజయుగ్మమతులం |
అంభోదవత్సుఖకరం భోగిభూషమనిశం భోగదం ప్రణమతాం |
స్తంభోరుశుండం అతులాంభోధితుల్యకృప శంభోః సుతం ప్రణమత || 6 ||
ఆశావిధానపటుం ఈశాత్మజం సురగణేశార్చితాఞ్ఘ్రియుగలం |
పాశాన్వితం సకలపాశాది బన్ధహరం ఆశాపతీడితగుణం |
ధీశాన్తిదం హృదయకోశాన్తరేణ భవనాశాయ ధారయ విభుం |
క్లేశాపహం(శోకాపహం) సకలదేశార్చితం సులభమీశానం ఇక్షురసికం || 7 ||
ధీరాతిధీర ఫలసారాదనాతిబల ఘోరారివర్గ భయద |
శురాగ్రజాత భవభారావమోచనద వీరాగ్రగణ్య సుముఖ |
మారాశుగార్తికర ధారాభయాపహర తారాప్రియాఙ్చిత కృపా-
వారాం నిధే ధవలహార-అద్య పాహి మదనీరాడ్య పాద వినతం || 8 ||
No comments:
Post a Comment